01:33
Aug 10, 2021
2
0
'దేశవ్యాపంగా పేదలకు ఆహార ధాన్యాల పంపిణీ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో గతంలో మాదిరిగానే మే, జూన్ నెలలకు పేదలందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆహార ధాన్యాల పంపిణీ కార్యక్రమంలో భాగ స్వాములయ్యే వివిధ విభాగాల అధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్థిక, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు. పీఎం గరీబ్ అన్న కల్యాణ యోజన పథకం కింద ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను అధికారులు ప్రధానికి వివరించారు. ఒకే దేశం- ఒకే రేషన్ కార్డు విధానం అమలు జరుగుతున్న తీరును అధికారులు ప్రధానికి వివరించారు. కాగా పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద అర్హులైన అందరికీ ఈ రెండు మాసాలు ఉచితంగా ఆహార ధాన్యాలు అన్ని రాష్ట్రాలకు సక్రమంగా రవాణా అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పౌర సమాజానికి చెందిన స్వచ్ఛంద సంస్థలు, కార్యకర్తలను ఈ పథకం అమలును వినియోగించుకోవాలని ప్రధాని సూచించారు. ఆరోగ్య కార్యకర్తలకు కేంద్రం గతంలో ప్రకటించిన బీమా పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్న ప్రధాని తెలిపారు. బీమా క్లైంలను వెంట వెంటనే పరిష్కరించాలని ప్రధాని సూచించారు. కొరోనా కారణంగా మృతి చెందిన ఆరోగ్య కార్యకర్తలకు ఈ బీమా పథకం వర్తిస్తుంది. కొరోనా రోగులు, ఆరోగ్య సిబ్బంది మధ్య వారధులుగా పని చేయడానికి అవసరమైతే మాజీ సైనికుల సేవలను వినియోగించుకోవాలని ప్రధాని ఆదేశించారు.'See also:
comments